భక్తులను ఒకేసారి ఎందుకు క్యూలైన్లలోకి వదిలారు..! 14 h ago
వైకుంఠద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. పద్మావతి పార్కు వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా, పవన్ కల్యాణ్ స్థానిక అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. "భక్తులను క్యూలైన్లలో ఒకేసారి ఎందుకు వదలాల్సి వచ్చింది?" అని ప్రశ్నించారు. హైవేకు సమీపంలో ఉన్నందున, భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారని చెప్పారు.